శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 25, 2020 , 19:39:04

ప్రేమించ‌డ‌మే పాప‌మైంది.. ఇంటికి పిలిచి హ‌త్య చేశారు

ప్రేమించ‌డ‌మే పాప‌మైంది.. ఇంటికి పిలిచి హ‌త్య చేశారు

పంజాబ్ : ఓ యువ‌కుడు త‌న మ‌న‌సుకు న‌చ్చిన అమ్మాయిని ప్రేమించాడు. కాని వారి ప్రేమ‌ను అమ్మాయి కుటుంబ స‌భ్యులు తిర‌స్క‌రించారు. ప్రియురాలితో ప్రియుడిని ఇంటికి పిలిపించి.. అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. ఈ అమానుష ఘ‌ట‌న లుధియానాలోని మోగా గ్రామంలో బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ఇంద్ర‌జిత్ సింగ్ అనే 19 ఏళ్ల యువ‌కుడు త‌న సొంత గ్రామంలోని మ‌రో అమ్మాయిని ఇష్ట‌ప‌డ్డాడు. ఆమెతో గ‌త ఐదారు నెల‌ల నుంచి ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నాడు. అయితే వీరి ప్రేమ‌ను అమ్మాయి కుటుంబ స‌భ్యులు తిర‌స్క‌రించారు. అత‌డిని ప్రేమించొద్ద‌ని యువ‌తిని బెదిరించారు. 

ఈ క్ర‌మంలో ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం.. ఇంద్ర‌జిత్ కు  బుధ‌వారం ఉద‌యం ప్రియురాలు ఫోన్ చేసి త‌న ఇంటికి రావాల‌ని కోరింది. దీంతో అత‌ను ఏ మాత్రం ఆలోచించ‌కుండా ఆమె ఇంటికెళ్లాడు. ఇంద్ర‌జిత్ ను ఇంట్లో నిర్బంధించి.. రాళ్లు, క‌ర్ర‌లు, బేస్ బాల్ బ్యాట్ల‌తో చావు దెబ్బ‌లు కొట్టారు. 

త‌మ కుమారుడు ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో.. తండ్రి నైబ్ సింగ్ వెత‌క‌డం ప్రారంభించాడు. ఆ అమ్మాయి నివాసం నుంచి అరుపులు వినిపించ‌డంతో అక్క‌డ‌కెళ్లి చూశాడు.  మాజీ స‌ర్పంచ్ క‌ల్పించుకుని బాధిత యువ‌కుడిని అమ్మాయి కుటుంబం నుంచి విడిపించారు. ఆ త‌ర్వాత చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఇంద్ర‌జిత్ క‌న్నుమూశాడు.  

మృతుడి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అమ్మాయి ఇంటికెళ్లి చూడ‌గా.. వారి నివాసంలో ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపించిన‌ట్లు పోలీసులు తెలిపారు. యువ‌కుడిపై దాడికి పాల్ప‌డ్డ ఏడుగురు వ్య‌క్తులు ప‌రారీలో ఉన్నార‌ని, వారిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు పేర్కొన్నారు.


logo