శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 19, 2021 , 11:01:36

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని త‌ల‌మ‌డుగు మండ‌లం ద‌హెగాంలో విషాదం నెల‌కొంది. పురుగుల మందు తాగి ఓ ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ద‌హెగాంకు చెందిన శ్రీరామ్‌(23), సుజాత‌(20) గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. తామిద్దరం ప్రేమించుకున్నామ‌ని, పెళ్లి చేసుకుంటామ‌ని త‌మ త‌ల్లిదండ్రుల‌కు తెలిపారు. ప్రేమికుల ప్ర‌తిపాద‌న‌ను పెద్ద‌లు తిర‌స్క‌రించారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ప్రేమికులు.. పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

VIDEOS

logo