గురువారం 04 జూన్ 2020
Crime - Feb 23, 2020 , 16:45:20

భువనగిరి ఖిల్లాపై ప్రేమికుల ఆత్మహత్యాయత్నం..

భువనగిరి ఖిల్లాపై ప్రేమికుల ఆత్మహత్యాయత్నం..

యాదాద్రి భువనగిరి: చారిత్రక భువనగిరి ఖిల్లాపై ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగి, సూసైడ్‌ చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రేమజంటను.. స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే అంబులెన్స్‌లను రప్పించి, బాధితులను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట.. సిద్దిపేట జిల్లా.. చేర్యాల, కొమురవెల్లి మండలానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.  


logo