శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 25, 2020 , 12:56:16

ప్రియురాలి స‌మాధి వ‌ద్ద ప్రియుడు ఆత్మ‌హ‌త్య‌

ప్రియురాలి స‌మాధి వ‌ద్ద ప్రియుడు ఆత్మ‌హ‌త్య‌

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి : ఓ ఇద్ద‌రు యువ‌తీయువ‌కులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని ప‌రిస్థితి. వారి అన్యోన్య‌మైన ప్రేమ సాగ‌రంలో విషాదం వాతావ‌ర‌ణం అలుముకుంది. అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందింది. త‌న ప్రేయ‌సి ఈ లోకాన్ని విడిచిపోవ‌డంతో.. తాను బ‌తికి లాభం లేద‌నుకున్నాడు ప్రియుడు. తాను కూడా త‌న ప్రియురాలి వ‌ద్ద‌కే వెళ్తాన‌ని ఆమె స‌మాధి వ‌ద్ద ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లంలోని కుదురుప‌ల్లి గ్రామంలో ఆదివారం ఉద‌యం చోటు చేసుకుంది.

మ‌హేశ్ అనే యువ‌కుడు గ‌త కొంత‌కాలం నుంచి ఓ యువ‌తిని ప్రేమిస్తున్నాడు. వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ ఆమె అనారోగ్యంతో మృతి చెంద‌డంతో మ‌హేశ్ తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. త‌న ప్రియురాలు లేని లోకంలో ఉండ‌లేనంటూ ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు మ‌హేశ్ వాట్సాప్ స్టేట‌స్ పెట్టుకున్నాడు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.