శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 25, 2020 , 13:36:23

చెల్లి వరుస యువతితో ప్రేమాయణం.. చివరకు ఆత్మహత్య

చెల్లి వరుస యువతితో ప్రేమాయణం.. చివరకు ఆత్మహత్య

షాజహాన్‌పూర్‌ :  చెల్లి వరుస యువతితో  ఓ యువకుడు ప్రేమాయణం సాగించాడు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో చివరకు ఈ జంట ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం షాజహాన్‌పూర్‌ జిల్లా పంఖఖేడ గ్రామానికి చెందిన విపిన్ (20)అతడి దగ్గరి బంధువు పూజ(18)గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో వారు చెల్లి వరుస యువతితో ప్రేమ ఏంటని ఇరువురిని మందలించారు. అయినా వారు వినకుండా పెళ్లి చేసుకుంటామనడంతో పెద్దలు వద్దని వారించారు.

దీంతో ప్రేమజంట శుక్రవారం ఇంటి నుంచి పారిపోయి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ఎస్పీ సిటీ సంజయ్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo