శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 16:50:52

ప్రేమించిన వాడే.. హత్య చేశాడు ..

ప్రేమించిన వాడే.. హత్య చేశాడు ..

నవరంగపూర్‌ :  ప్రేమించిన యువకుడి కోసం వెళ్లిన యువతి హత్యకు గురవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.  నవరంగపూర్‌ జిల్లా తెంతులుకుంటి సమితి కొంచులుగుమ్మ గ్రామానికి చెందిన యువతిని  చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరంగపూర్‌లోని ఓ కళాశాలలో చదువుతున్న కొంచుగుమ్మకు చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది.  ఈ నేపథ్యంలో గురువారం యువతిని గ్రామంలో ఓ విద్యాలయం వద్ద కలుసుకుందామని పిలిచాడు. అక్కడికి బయలుదేరి వెళ్లిన ఆమె ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమెను వెతుకుతూ వెళ్లిన కుటుంబ సభ్యులు విద్యాలయం వద్ద యువతి అచేతనంగా పడి వుండాటాన్ని గుర్తించారు. దవాఖానకు తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటుంబసభ్యులు యువకుడిపై పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం వెతుకున్నారు. 


logo