మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 15, 2020 , 12:08:56

ప్రేమ విఫలమై టెకీ ఆత్మహత్య

ప్రేమ విఫలమై టెకీ ఆత్మహత్య

హైదరాబాద్‌ : ప్రేమ విఫలమై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు గ్రామానికి చెందిన వంకరబోయిన శ్రీనివాసులు, కృష్ణమూర్తి అన్నదమ్ములు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి గచ్చిబౌలి సుదర్శన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా, కృష్ణమూర్తి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. 

ఇదిలా ఉండగా శ్రీనివాసులు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమకు యువతి ఒప్పుకోకపోవడంతో గురువారం కృష్ణమూర్తి ఆఫీస్‌కు వెళ్లిన సమయం చూసి శ్రీనివాస్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విధులు ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చిన కృష్ణమూర్తి తలుపులు కొట్టగా ఎంతకూ తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపులు బద్దలు కొట్టి చూడగా శ్రీనివాస్‌ విగతజీవిగా పడి ఉన్నట్లు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కృష్ణమూర్తిని విచారించగా.. ప్రేమ విఫలమే కారణమని తెలిపినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo