మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 11:48:44

వికారాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య?

వికారాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య?

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నవాబుపేట మండలం పూలపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతులు చేవెళ్ల మండలం గొల్లపల్లి కి చెందిన సార కార్తీక్ (20) అదే గ్రామానికి చెందిన కటికె మీన( 19)గా గుర్తించారు. మీనకు నెల క్రితం శషాంబాద్ మండలం మంచిరేవుల అబ్బాయితో వివాహం జరిగింది.

అయితే ప్రేమించిన వ్యక్తిని కాదని వేరొకరికిచ్చి పెండ్లి చేయడంతో నిన్న ప్రేమికుడితో కలిసి నవాబుపేట మండలం పులపల్లి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo