శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 17:18:22

ఇద్ద‌రు మైన‌ర్ల మ‌ధ్య ప్రేమాయ‌ణం.. లైంగిక‌దాడి

ఇద్ద‌రు మైన‌ర్ల మ‌ధ్య ప్రేమాయ‌ణం.. లైంగిక‌దాడి

ఉత్త‌రాఖండ్ : ఓ మైన‌ర్ బాలుడు ప్రేమ పేరుతో బాలిక‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించ‌గా.. తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన బాలిక ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన ఘ‌ట‌న ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ న‌గ‌ర్‌లో చోటు చేసుకుంది. 

వివ‌రాలు.. ఉధమ్‌సింగ్ న‌గ‌ర్ జిల్లాలోని పంత్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన కిశోర్ అనే మైన‌ర్ బాలుడు పొరుగున నివ‌సించే మ‌రో మైన‌ర్ బాలికకు కొద్ది రోజుల కింద ప్రేమ పేరుతో ద‌గ్గ‌ర‌య్యాడు. త‌రువాత ఆమెపై బ‌ల‌వంతంగా లైంగిక‌దాడికి పాల్ప‌డి.. ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించాడు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన బాలిక ఆగస్టు 23న పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. త‌రువాత విష‌యం గురించి త‌ల్లిదండ్రుల‌కు తెలుప‌డంతో బాలిక తండ్రి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మైనర్‌ను గురువారం అదుపులోకి తీసుకుని జువెనైల్ కోర్టులో హాజరుపర్చిన‌ట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo