మంగళవారం 11 ఆగస్టు 2020
Crime - Jul 08, 2020 , 16:00:37

కరోనాతో ఉపాధి కోల్పోయి.. ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

కరోనాతో ఉపాధి  కోల్పోయి.. ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

ప్రపంచం మొత్తన్ని వణికిస్తున్న కరోనా రక్కసి  కోట్ల మందిని రోడ్డుపాలు చేసింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి దేశంలో లక్షలాది జనాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కూలీనాలీ చేసుకొని బతికే చిన్నాచితకా జీవితాలు కరోనా దెబ్బకి శిథిలమై పోతున్నాయి. ఇంటి రెంటులు కట్టలేక.. తినడానికి తిండిలేక ఏ చేయాలోదిక్కుతోచని అమాయకులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కరోనా కాటుకి బలై నిశ్శబ్దంగా నిష్కృమిస్తున్నారు.

అలాంటి విషాధ ఘటన మరోటి నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి  కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్‌ ఫైనాన్స్‌ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చండూరు మండలం కొండాపురం వాసి గడ్డం శ్రీకాంత్‌(22) ఇటీవల ఫైనాన్స్‌లో ఆటో కొనుక్కుని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆటో తిరిగే పరిస్థితి లేదు. ఉపాధి కోల్పోవడంతో ఆటో కోసం తీసుకున్న డబ్బులకు కిస్తీలు చెల్లించలేకపోయాడు.

డబ్బులు చెల్లించాలంటూ ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్‌ను ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. సాయంత్రంలో వేళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్‌ మరణంతో గ్రామంలో విషాదాఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


logo