బుధవారం 24 ఫిబ్రవరి 2021
Crime - Jan 20, 2021 , 07:43:07

విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం

విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ సమీపంలో లారీ బోల్తా పడింది. షాంపూ లోడ్‌తో విజయవాడ నుంచి హైదారాబాద్‌ వైపు వస్తున్న లారీ చౌటుప్పల్‌ మండలంలోని కైతాపురం వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. లారీ.. రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. క్రేన్‌ సహాయంతో లారీని తొలగిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని పోలీసులు తెలిపారు. 

VIDEOS

logo