గురువారం 21 జనవరి 2021
Crime - Dec 17, 2020 , 17:57:29

బైక్‌ను ఢీ కొట్టిన లారీ..ఒకరి మృతి

బైక్‌ను ఢీ కొట్టిన లారీ..ఒకరి మృతి

సంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరు వీవ్రంగా గాయపడ్డ విషాద ఘటన జిల్లాలోని నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..నిజాంపేట్ వద్ద నేషనల్‌ హైవేపై బైక్‌పై వెళ్తున్న కల్హేర్ మండలం దామర చెరువు గ్రామానికి చెందిన సంగయ్య(35) ను లారీ ఢీ కొట్టింది. దీంతో సంగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. రాంరెడ్డిపేట్‌కు చెందిన ముర్షద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo