శనివారం 24 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 07:41:33

గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్‌ దుర్మరణం

గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్‌ దుర్మరణం

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం సమీపంలోని సీసీ కెమెరాలను  పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo