శుక్రవారం 15 జనవరి 2021
Crime - Nov 15, 2020 , 11:23:04

లారీ క్లీనర్‌ దారుణ హత్య

లారీ క్లీనర్‌ దారుణ హత్య

ఖమ్మం : ఏపీలోని కాకినాడకు చెందిన లారీ డ్రైవర్‌ ఘాతుకానికి పాల్పడ్డాడు. క్లీనర్‌ను దారుణంగా రాడ్డుతో కొట్టి కత్తితో పొడిచి చంపాడు. డ్రైవర్‌ నైఫ్‌ రాజు, క్లీనర్‌ రాజు ఇరువురు కాకినాడ నుంచి కరీంనగర్‌కు నూకల లోడు కోసం వెళ్లారు. కరీంనగర్‌ నుంచి తిరిగి వెళ్తుండగా డ్రైవర్‌, క్లీనర్‌ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో క్లీనర్‌ను డ్రైవర్‌ కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని లారీలోనే వేసుకొని కొణిజర్ల పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.