శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 11, 2020 , 22:47:58

స్తంభానికి క‌ట్టేసి, బ‌ట్ట‌లూడ‌దీసి మ‌రీ ప్రేమజంట‌ను చిత‌క‌బాదిన స్థానికులు.. కేసు న‌మోదు

స్తంభానికి క‌ట్టేసి, బ‌ట్ట‌లూడ‌దీసి మ‌రీ ప్రేమజంట‌ను చిత‌క‌బాదిన స్థానికులు.. కేసు న‌మోదు

మహారాజ్ గంజ్ : ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం మ‌హారాజ్‌గంజ్ జిల్లాలో స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమ జంట‌ను స్థానికులు స్తంభానికి క‌ట్టేసి, ప్రియుడి బ‌ట్ట‌లూడ‌దీసి మ‌రీ చిత‌క‌బాదారు. ఈ ఘ‌ట‌న‌లో ప్రేమికుడితో పాటు మ‌రో న‌లుగురిపై కేసులు న‌మోద‌య్యాయి. 

వివ‌రాలు.. మహారాజ్‌గంజ్ జిల్లా ఘుగ్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో కొన్నిరోజుల క్రితం ఓ ప్రేమ జంట‌ను స్థానికులు ప‌ట్టుకొని స్తంభానికి క‌ట్టేసి చిత‌క‌బాదారు. ప్రియుడి బ‌ట్ట‌లూడ‌దీసి నానా దుర్భాష‌లాడుతూ చావ‌బాదారు. అంతేకాకుండా ఈ త‌తంగాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైర‌ల్ కావ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు యువ‌తి త‌ల్లిదండ్రుల‌ పిర్యాదు మేర‌కు ప్రియుడితో పాటు గ్రామ‌స్తులు ప‌లువురిపై, వీడియో వైర‌ల్ చేసిన‌వారిపై కేసులు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్పీ రోహిత్ సింగ్ సజ్వాన్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo