మంగళవారం 02 జూన్ 2020
Crime - Mar 10, 2020 , 16:31:07

విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ మృతి..

విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ మృతి..

మెదక్‌: విద్యుత్‌ షాక్‌తో ఓ లైన్‌మెన్‌ మరణించాడు. ఈ విషాద ఘటన తుప్రాన్‌ మండలం, లింగారెడ్డిపేట్‌లో చోటుచేసుకుంది. విద్యుత్‌శాఖలో లైన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణారెడ్డి(35).. తన విధిలో భాగంగా లింగారెడ్డి పేట్‌ వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ చేస్తుండగా, విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మరణించాడు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమందించారు. ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుప్రాన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, కృష్ణారెడ్డి.. గజ్వేల్‌ నియోజకర్గంలోని బంగ్లా వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


logo