శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jun 28, 2020 , 14:14:03

లేచిపోయిన ఇద్ద‌ర‌మ్మాయిలు.. ఒక‌రిపై కేసు న‌మోదు

లేచిపోయిన ఇద్ద‌ర‌మ్మాయిలు.. ఒక‌రిపై కేసు న‌మోదు

భోపాల్ : ఇద్ద‌ర‌మ్మాయిలు ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేశారు. ఈ క్ర‌మంలో పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఆ ఇద్ద‌రు అమ్మాయిలు త‌మ ఇండ్ల‌లో ఎవ‌రికీ చెప్ప‌కుండా వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని గునా జిల్లాలో చోటు చేసుకుంది. 

శివ‌పురికి చెందిన అమ్మాయికి ఓ వేడుక‌లో మ‌రో అమ్మాయి న‌చ్చింది. వీరిద్ద‌రూ వ‌రుస‌కు క‌జిన్స్ కావ‌డంతో.. వారి ప్రేమ‌కు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఇద్ద‌రు మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేశారు. ఇక పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుని.. గ‌త నెల‌లో లేచిపోయి వివాహం చేసుకున్నారు. 

అయితే వీర‌ద్ద‌రిపై వారి త‌ల్లిదండ్రులు జూన్ 22న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. లేచిపోయిన అమ్మాయిలిద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక‌రు మైన‌ర్ కావ‌డంతో.. పెళ్లికి ప్రేరేపించిన మ‌రో అమ్మాయిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు పోలీసులు. 


logo