ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 28, 2020 , 18:43:10

పులి దాడిలో లేగదూడ మృతి

పులి దాడిలో లేగదూడ మృతి

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వారావుపేట మండలం నందిపాడు ఫారెస్ట్‌ బీట్‌ పరిధిలోని దామరచర్ల అటవీ ప్రాంతంలో కంపార్టుమెంటు 426లో సోమవారం తెల్లవారుజామున పెద్దపులి సంచరించింది. నందిపాడు గ్రామానికి చెందిన మెచ్చు గంగరాజుకు చెందిన లేగదూడను చంపి సుమారు 900 మీటర్లు ఈడ్చుకెళ్లింది. సమాచారం తెలుసుకున్న రేంజర్‌ అబ్దుల్‌ రహ్మన్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పులి జాడలు గుర్తించారు. పులి దాడిలో లేగదూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. పశు వైద్యురాలు స్వప్నతో పోస్టుమార్టం చేయించారు. అనంతరం రేంజ్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు చెప్పారు.


logo