మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 31, 2020 , 11:31:26

లారీ, వ్యాన్ ఢీకొని ఇద్దరు మృతి

లారీ, వ్యాన్ ఢీకొని ఇద్దరు మృతి

ఆదిలాబాద్ : జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలం భక్తి సంఘం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ రోడ్డుపై నిలిచి ఉండగా.. నాగపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న వ్యాన్ అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ క్లీనర్ మృతి చెందారు. డ్రైవర్ లైసెన్స్ ఆధారంగా  హైదరాబాద్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo