శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 24, 2021 , 10:19:46

అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి

అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుల్బర్గా నుంచి బేగంబజార్‌ వైపు వస్తున్న లోడ్‌తో వస్తున్న లారీ ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో వేగంగా వస్తూ హిమాయత్‌సాగర్‌ ఎగ్జిట్‌-17 వద్ద డైవర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ బోల్తా పడడంతో లారీ డ్రైవర్‌తో సహా క్లీనర్‌ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వీరిని మున్నా, శరత్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. లారీ లోడ్‌లో పప్పులతో పాటు జర్దా ప్యాకెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వేగంగా వస్తూ అదుపు తప్పి డివైజర్‌ను ఢీకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జర్దా ప్యాకెట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? బేగంబజార్‌లో ఎక్కడ డంప్‌ చేస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మొబైల్‌ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో మృతిచెందిన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.

VIDEOS

logo