గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 30, 2020 , 22:17:47

టీచ‌ర్‌కు లైంగిక వేధింపులు.. తోటి అధ్యాప‌కుడికి దేహశుద్ధి

టీచ‌ర్‌కు లైంగిక వేధింపులు.. తోటి అధ్యాప‌కుడికి దేహశుద్ధి

స‌త్తుప‌ల్లి రూర‌ల్ : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ అధ్యాపకుడు తోటి అధ్యాపకురాలి ప‌ట్ల‌నే అనుచితంగా ప్రవర్తించాడు. మొబైల్‌ ద్వారా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగి వేసారిన బాధితురాలు భర్తకు విష‌యాన్ని తెలిపింది. దీంతో బంధువులతో కలిసి వ‌చ్చి సదరు అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సత్తుపల్లిలో వెలుగు చూసింది. పట్టణంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న ఓ వ్యక్తి అదే కళాశాలలో ఓ వివాహితతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో మ‌హిళ గ‌ట్టిగానే బుద్ధిచెప్పింది.