సోమవారం 25 జనవరి 2021
Crime - Nov 07, 2020 , 11:42:26

కుక్క‌పై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

కుక్క‌పై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

ముంబై : ఓ యువ‌కుడు పాడు ప‌ని చేశాడు. మూగ జీవిపై త‌న రాక్ష‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాడు. కామంతో ర‌గిలిపోయిన ఆ కామాంధుడు ఆడ కుక్క మూతికి గ‌ట్టిగా తాడు క‌ట్టి అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ముంబైలోని పొవారి ఏరియాలో గురువారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

శోభ‌నాథ్ స‌రోజ్ అనే యువ‌కుడు కుక్క‌ను తీసుకుని స్థానికంగా ఉన్న సెల్లార్‌లోని ఓ గ‌దిలోకి వెళ్లాడు. ఆ త‌ర్వాత కుక్క అర‌వ‌కుండా దాని మూతికి గ‌ట్టిగా తాడు క‌ట్టాడు. ఆ త‌ర్వాత అత్యాచారం చేసి పారిపోయాడు. కుక్క మూలుగుతూ ఉండ‌టాన్ని సెక్యూరిటీ గార్డులు గ‌మ‌నించి.. ఆ గ‌ది వ‌ద్ద‌కు వెళ్లారు. తీవ్ర ర‌క్తస్రావంతో బాధ‌ప‌డుతున్న కుక్క‌ను సెక్యూరిటీ గార్డులు చేర‌దీశారు. దాని మూతికి క‌ట్టిన తాడును విప్పేసి జంతు సంర‌క్ష‌ణ ప్ర‌తినిధుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు స‌రోజ్‌ను పోలీసులు అరెస్టు చేసి ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. అనంత‌రం రిమాండ్‌కు త‌ర‌లించారు. వైద్య ప‌రీక్షల నిమిత్తం కుక్క‌ను వెట‌ర్న‌రీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 


logo