సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 11:23:06

విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

మంగళూరు : కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు వచ్చిన ఫోన్‌కాల్‌ కలకలం సృష్టించింది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు విమానశ్రయంలో బాంబు పెట్టారని విమానాశ్రయ మాజీ డైరెక్టర్ ఎం. వాసుదేవాకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, సెంట్రల్ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఎస్ఎఫ్), బాంబు స్క్వాడ్‌ బృందం అణువణువు తనిఖీ చేసింది. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో నకిలీ ఫోన్‌ కాల్‌గా నిర్ధారించారు. దర్యాప్తు చేపట్టి ఫోన్‌ చేసింది ఉడుపి జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యవసాయ కూలీ వసంత్‌గా గురువారం గుర్తించారు. పౌర విమానయాన భద్రతా చట్టాలను ఉల్లఘించిన నిందితుడిపై మంగళూరు బాజ్‌పే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


logo