మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jun 15, 2020 , 09:45:39

ఇద్దరు పిల్లలను బిల్డింగ్‌ పైనుంచి విసిరేసిన ఓ వ్యక్తి

ఇద్దరు పిల్లలను బిల్డింగ్‌ పైనుంచి విసిరేసిన ఓ వ్యక్తి

కోల్‌కతా: ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను నాలుగంతస్తుల బిల్డింగ్‌ పైనుంచి విసిరేశాడు. ఈ ఘటనలో రెండేండ్ల బాలుడు మరణించగా ఆరేండ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పశ్చిమ బెంగాల్‌లోని బుర్రాబజార్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. చిన్నారులను భవనం పైనుంచి పడేసిన 55 ఏండ్ల వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఎందుకు ఇలా చేశాడో అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరణించిన బాలుడి తండ్రితో తలెత్తిన వివాదం వల్లనే అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు గాయపడిన బాలుడికి, చనిపోయిన బాలుడికి మధ్య ఏ సంబంధం ఉన్నది అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 


logo