శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 24, 2020 , 14:41:24

మ‌ద్యం మ‌త్తులో యువ‌తి.. అర్ధ‌న‌గ్నంగా రోడ్డుపై

మ‌ద్యం మ‌త్తులో యువ‌తి.. అర్ధ‌న‌గ్నంగా రోడ్డుపై

కోల్ కతా : ఓ యువ‌తి మ‌ద్యం అతిగా సేవించింది. త‌న శ‌రీరంపై వ‌స్ర్తాలు ఉన్నాయా? లేవా? అనే స్పృహ కోల్పోయి.. రోడ్ల‌పై తిరిగింది. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తాలోని రెడ్ రోడ్ ఏరియాలో మంగ‌ళ‌వారం రాత్రి చోటు చేసుకుంది. 

కోల్ క‌తాలోని ప‌ద్మాపుకూర్ ఏరియాకు చెందిన ఓ యువ‌తి.. త‌న స్నేహితుల‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లింది. ఆ త‌ర్వాత ఒక‌రితో క‌లిసి పీక‌ల దాకా మ‌ద్యం సేవించింది. అనంత‌రం కోల్ క‌తా మైదాన్ ఏరియాలో కాసేపు ఇద్ద‌రూ క‌లిసి తిరిగారు. స్నేహితుడు వెళ్లిన త‌ర్వాత‌.. యువ‌తి ఒక్క‌తే తూలుతూ.. అర్ధ‌న‌గ్నంగా క‌నిపించింది. శ‌రీర పైభాగంలో వ‌స్ర్తాలు లేక‌పోవ‌డంతో.. ఇత‌రులు నివ్వెర‌పోయారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 

అక్క‌డికి చేరుకున్న పోలీసులు.. యువ‌తిని అదుపులోకి తీసుకుని స్టేష‌న్ కు త‌ర‌లించారు. యువ‌తి తిరిగిన ప్ర‌దేశానికి.. ఆమె నివాసం ఐదు కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo