శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 12:08:06

ఆస్తికోసం కుటుంబాన్ని మొత్తం చంపించి.. అదృశ్యమైనట్లు నటించి..

ఆస్తికోసం కుటుంబాన్ని మొత్తం చంపించి.. అదృశ్యమైనట్లు నటించి..

సిమ్లా : ఉత్తరాఖండ్‌లో ఘోరం వెలుగు చూసింది. ఆస్తికోసం భర్త సాయంతో తల్లిదండ్రులను, తోబుట్టువులను కడతేర్చి అదృశ్యమైనట్లు నమ్మించింది ఓ ప్రబుద్ధురాలు. ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు తండ్రికి తెలిసిన వ్యక్తి సాయం కోరి పోలీసులకు దొరికిపోయింది. 2019 ఏప్రిల్ 20న నరేంద్ర గంగ్వార్ అనే వ్యక్తి భార్య లీలావతి, స్నేహితుడు విజయ్ గంగ్వార్ సాయంతో మామ హిరాలాల్ అతడి భార్య, ఇద్దరు కుమార్తెలను హతమార్చి ఇంటి ఆవరణలో పూడ్చాడు. ఇటీవల నరేంద్ర గంగ్వార్‌ హిరాలాల్‌ స్నేహితుడైన దుర్గా ప్రసాద్‌ను కలిసి అత్తామామల మరణ ధృవీకరణ పత్రాలు సంపాదించేందుకు సాయం చేయాలని కోరాడు.

అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్‌ పోలీసులకు విషయం చెప్పడంతో తీగ లాగడంతో విషయం బయటపడిందని ఉధమ్ సింగ్ నగర్ ఎస్ఎస్పీ దిలీప్ సింగ్ కున్వర్ తెలిపారు. మీరగంజ్ వద్ద 12 ఎకరాల భూమి కోసమే తన తల్లిదండ్రులను, ఇద్దరు సోదరీమణులను చంపేందుకు నరేంద్ర గంగ్వార్‌ భార్య లీలావతి కుట్ర చేసిందని ఎస్‌ఎస్‌స్పీ పేర్కొన్నారు. నలుగురి అస్థిపంజరాలను ఇంటి కాంపౌండ్ నుంచి శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo