ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 08, 2020 , 21:11:27

నార్సింగిలో తల్లీకొడుకు కిడ్నాప్‌

నార్సింగిలో తల్లీకొడుకు కిడ్నాప్‌

సైబరాబాద్:  నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తల్లీకొడుకును కిడ్నాప్‌ చేశారు. నాంపల్లి కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఆదిలక్ష్మి, ఆమె కుమారుడు ప్రజ్వన్‌ను గుర్తు తెలియని దుండగులు నల్లటి కారులో వచ్చి కిడ్నాప్‌ చేశారు.

బండ్లగూడ మున్సిపాలిటీ పరిధి పిరన్ చెరువు గ్రామం గంధంగూడలోని  అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో కిడ్నాపునకు గురయ్యారని ఆమె రెండో కుమారుడు తెలిపారు. కిడ్నాపు సమయంలో తాను కొంతదూరంలో ఉన్నానని, తల్లిని, సోదరుడిని కారులో తీసుకొని వెళ్తుండగా గమనించానని  వివరించాడు.

ఆదిలక్ష్మి ప్రతీరోజు ఆలయానికి వచ్చి 11 ప్రదక్షిణలు  చేస్తుందని ఆలయ పూజారి తెలిపారు. కిడ్నాప్‌ విషయం తెలుసుకున్న నార్సింగ్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్థు చేస్తున్నట్లు వివరించారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo