గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 17, 2020 , 11:52:46

కరోనా లక్షణాలతో ఖానాపూర్ ఏఎస్ఐ మృతి

కరోనా లక్షణాలతో ఖానాపూర్ ఏఎస్ఐ మృతి

నిర్మల్ : జిల్లాలోని ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా పని చేస్తున్నా జన్నారపు నారాయణ సోమవారం ఉదయం కరోనా లక్షణాలతో చనిపోయాడు. ఆయన వయసు 56 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. రెండు రోజులుగా ఆయన శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి తీవ్రం కావడంతో అర్థరాత్రి ఖానాపూర్ దవాకానకు చికిత్స కోసం వచ్చారు. ఆయనను స్థానిక డాక్టర్లు నిర్మల్ కు రెఫర్ చేశారు. నిర్మల్ లోని ఓ ప్రైవేటు దవాఖానాకు చికిత్సకోసం వెళ్లగా నారాయణ పరిస్థితి అప్పటికే పూర్తిగా విషమించింది. 

మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో డిచ్ పల్లి వద్ద మరణించారు. ఆయన మృతదేహానికి స్నేహితులు మున్సిపాలిటీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి జేసీబీ సహాయంతో ఖానాపూర్ శివారులో ఖననం చేశారు. కరోనా ప్రభావంతోనే నారాయణ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.logo