మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 22, 2020 , 16:49:44

చిన్నారులను చేరదీసిన ఖమ్మం టూ టౌన్ సీఐ

చిన్నారులను చేరదీసిన ఖమ్మం టూ టౌన్ సీఐ

ఖమ్మం : నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో అనాథలుగా వదిలి వెళ్లిన తల్లి కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు చిన్నారులను ఖమ్మం టూ టౌన్ సీఐ తుమ్మ గోపి, మహిళ కానిస్టేబుల్ రేణుక చేరదీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి కొత్త బట్టలు కొనిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురానికి చెందిన తండ్రి జల్లి వేంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చి చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సమక్షంలో తండ్రి వేంకటేశ్వర్లకు చిన్నారులను అప్పగించారు.