గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 07, 2020 , 17:40:14

కరోనా సోకిన మహిళపై లైంగికదాడి చేసిన హెల్త్ ఇన్స్‌స్పెక్టర్ అరెస్ట్

కరోనా సోకిన మహిళపై లైంగికదాడి చేసిన హెల్త్ ఇన్స్‌స్పెక్టర్ అరెస్ట్

తిరువనంతపురం: కరోనా సోకి క్వారంటైన్‌లో ఉన్న మహిళపై లైంగికదాడి చేసిన జూనియర్ హెల్త్ ఇన్స్‌స్పెక్టర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురానికి చెందిన ఒక మహిళకు కరోనా పాటిజివ్‌గా రావడంతో క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చింది. అయితే ఆ సర్టిఫికెట్ ఇస్తానంటూ జూనియర్ హెల్త్ ఇన్స్‌స్పెక్టర్‌ ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నాడు. తన ఇంటికి వచ్చిన ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని గుర్తించి సోమవారం అరెస్ట్ చేశారు. కాగా, పఠనంథిట్టలో కరోనా పాజిటివ్ మహిళపై అంబులెన్స్ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన ఘటనపై ఆ రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బాధ్యత వహించి ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా సభ్యులు డిమాండ్ చేశారు.


 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo