గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 29, 2020 , 22:42:10

క‌త్తితో పొడిచి కారుతో తొక్కించి.. అమెరికాలో కేర‌ళ న‌ర్సు దారుణ హ‌త్య!‌

క‌త్తితో పొడిచి కారుతో తొక్కించి.. అమెరికాలో కేర‌ళ న‌ర్సు దారుణ హ‌త్య!‌

తిరువ‌నంత‌పురం: అమెరికాలో దారుణం జ‌రిగింది. కేరళకు చెందిన ఓ నర్సుపై ఆమె భ‌ర్తే కత్తితో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచి, ఆపై ఆమె పైనుంచి కారుతో తొక్కించి అత్యంత కిరాత‌కంగా హ‌త్యచేశాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘోరం జ‌రిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

వివరాల్లోకి వెళ్తే.. కొట్టాయంకు చెందిన మెరీన్ జాయ్ (26) తన భర్త ఫిలిప్ మాథ్యూ (34)తో కలిసి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో నివసిస్తున్న‌ది. అక్కడే ఒక‌ ఆస్పత్రిలో మెరీన్ జాయ్‌ నర్సుగా ప‌ని చేస్తున్న‌ది. అయితే, ఈ మ‌ధ్య భార్యాభర్తల న‌డుమ త‌ర‌చూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మంగళవారం మెరీన్ విధులను ముగించుకొని ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరింది. 

అదే సమయంలో పార్కింగ్ స్థలంలో కాపుగాసిన భర్త ఫిలిప్ ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్ప‌డ్డాడు. అంత‌టితో ఆగ‌ని ఫిలిప్‌.. క‌త్తిపోట్ల‌కు తాళ‌లేక కిందపడిపోయి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న‌ మేరీన్ పైనుంచి కారుతో తొక్కించి వెళ్లిపోయాడు. స్థానికులు వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మెరీన్ మరణించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo