శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Sep 21, 2020 , 08:32:07

క్వారీలో పేలుడు.. ఇద్దరు వలస కార్మికులు దుర్మరణం

క్వారీలో పేలుడు.. ఇద్దరు వలస కార్మికులు దుర్మరణం

ఎర్నాకుళం : క్వారీలో పేలుడు ధాటికి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మలయాత్తూర్ ప్రాంతంలోని క్వారీలో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. క్వారీ వెంట కార్మికుల వసతి కోసం నిర్మించిన భవనంలో పేలుడు పదార్థాలు నిల్వ చేశారు. పేలుడు ధాటికి ఈ భవనం పూర్తిగా ధ్వంసమైంది. మృతి చెందిన ఇద్దరు కరోనా బారినపడి భవనంలో హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను తమిళనాడుకు చెందిన పెరియన్నన్, కర్ణాటకకు చెందిన ధనపాలన్‌గా గుర్తించారు. పేలుడుకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తేలియరాలేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo