శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 20:06:22

క్వారంటైన్‌లో యువ ఇంజినీర్‌.. గొంతు కోసుకుని ఆత్మహత్య.!

క్వారంటైన్‌లో యువ ఇంజినీర్‌.. గొంతు కోసుకుని ఆత్మహత్య.!

కన్నూర్ : కేరళలో కన్నూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విదేశాల నుంచి వచ్చిన యువ ఇంజినీర్‌ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలివి.. కువైట్ నుంచి వచ్చిన టీవీ శరత్‌ (30)అనే యువకుడు కన్నూర్‌లోని తన నివాసం వెంట ఉన్న ఔట్‌హౌస్‌లో క్వారంటైన్‌లో ఉంటున్నాడు. శనివారం ఉదయం శరత్‌కు బంధువు అల్పాహారం ఇవ్వడానికి వెళ్లగా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహం వద్ద రెండు బ్లేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గత నెలలో శరత్‌ విదేశాల నుంచి తిరిగి వచ్చాడని, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo