శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 15:09:46

పొలంలో గంజాయి సాగు.. ఇద్దరు అరెస్ట్

పొలంలో గంజాయి సాగు.. ఇద్దరు అరెస్ట్

బెంగళూరు: పొలంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ రూరల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దొద్దమట్టి గ్రామానికి చెందిన ఇద్దరు తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి పండిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో కుమ్సి పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం సోమవారం ఆ పొలాన్ని సందర్శించి ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకున్నది. అనంతరం  పోలీసులు ఆ గంజాయి సాగును ధ్వంసం చేశారు. పాండురంగ, హనుమంత అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న రూ.26,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ చట్టానికి సంబంధించిన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శివమొగ్గ పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo