గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 12:00:38

సర్వీస్‌ రివాల్వర్‌ పేలి ఐపీఎస్‌ అధికారి మెడలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

సర్వీస్‌ రివాల్వర్‌ పేలి ఐపీఎస్‌ అధికారి మెడలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

బెంగళూర్‌ : సర్వీస్‌ రివాల్వర్‌ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో ఐపీఎస్‌ అధికారి మెడలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్పీశర్మ బెంగళూర్‌లోని కోత్నూర్ ప్రాంతంలోని నివాసంలో ఉంటున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో బుల్లెట్ మెడలోంచి దూసుకెళ్లింది. గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలినట్లు శర్మ లిఖితపూర్వకంగా తెలిపారని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ చెప్పారు. పొరపాటునే గన్‌ పేలినట్లు దర్యాప్తు బృందానికి సీపీ నివేదిక ఇచ్చారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo