బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 12:45:03

మృతదేహాలు తారుమారు... బంధువుల ఆందోళన

మృతదేహాలు తారుమారు... బంధువుల ఆందోళన

బెంగళూరు: దవాఖానలో చనిపోయిన ఇద్దరి మృతదేహాలు తారుమారు కావడంతో ఒక రోగి బంధువులు ఆందోళనకు దిగారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఈ ఘటన జరిగింది. కుండపురాలోని దవాఖానలో చికిత్స పొందుతున్న ఇద్దరు మరణించారు. అయితే వైద్య సిబ్బంది మృతదేహాలను తారుమారు చేసి రెండు కుటుంబాలకు అప్పగించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తమకు అప్పగించడంపై ఒక కుటుంబం దవాఖాన వద్ద నిరసనకు దిగింది.

మరణించిన తన సోదరుడి మృతదేహాన్ని కుండపురాకు చెందిన ఒక కుటుంబానికి ఇచ్చి కరోనాతో చనిపోయిన గుర్తుతెలియని మృతదేహాన్ని తమకు ఇచ్చారంటూ మృతుడి సోదరుడు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మృతదేహాల తారుమారుపై దవాఖాన యాజమాన్యం స్పందించలేదు. కాగా, కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 2.72 లక్షలకు చేరగా 4,600 మందికిపైగా మరణించారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo