సోమవారం 26 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 17:33:14

గర్భిణీతో సహా ఏడుగురు మృతి

గర్భిణీతో సహా ఏడుగురు మృతి

బెంగళూరు: గర్భిణీ మహిళతో సహా ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్ణాటకలోని కలబురగిలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం సవలగి గ్రామానికి సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు నుంచి దిగువకు దొర్లిపడ్డాయి. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా ఈ ప్రమాదంలో చనిపోయారు. గర్భిణీ మహిళా ఇర్ఫానా బేగం (25), రూబియా బేగం (50), అబెదాబీ (50), జయచునాబీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (38), శౌఖత్ అలీ (29) మరణించిన వారిలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.  మృత దేహాలను వాహనం నుంచి బయటకుతీసి పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo