మంగళవారం 04 ఆగస్టు 2020
Crime - Jul 04, 2020 , 16:08:12

కాన్పూర్ ఎన్ కౌంట‌ర్.. ఉప‌యోగించిన ఆయుధాలివే..

కాన్పూర్ ఎన్ కౌంట‌ర్.. ఉప‌యోగించిన ఆయుధాలివే..

ల‌క్నో : రౌడీషీట‌ర్, 60 క్రిమిన‌ల్ కేసుల్లో నిందితుడైన వికాస్ దూబేను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల బృందంపై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. దూబే ముఠా జ‌రిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా స‌హా ముగ్గురు ఎస్ఐలు, న‌లుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ పోలీసు బృందంపై రౌడీ మూక‌లు.. స్ర్పింగ్ రైఫిల్స్, ఏకే 47 రైఫిల్, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, 1 గ్లాక్, రెండు 9ఎంఎం పిస్తోల్స్ ఉప‌యోగించారు. ఈ ఎన్ కౌంట‌ర్లో మొత్తం 100 బుల్లెట్లు ఉప‌యోగించి.. 8 మంది పోలీసుల ప్రాణాల‌ను బ‌లిగొన్నారు. వీటిలో కొన్ని ఆయుధాలు పోలీసుల నుంచి దొంగిలించిన‌వి ఉన్నాయి. ఇక దూబే ముఠా కాల్పుల్లో ఒక సాధార‌ణ పౌరుడు స‌హా ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 


logo