శనివారం 23 జనవరి 2021
Crime - Nov 21, 2020 , 18:43:20

కామారెడ్డి డీఎస్పీ మెడకు ఏసీబీ కేసు..

కామారెడ్డి డీఎస్పీ మెడకు ఏసీబీ కేసు..

నిజామాబాద్‌ : ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డ కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్అవినీతి కేసులో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి డి.ఎస్.పి లక్ష్మీనారాయణ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా డీఎస్పీ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేసి పోలీసు అతిథి గృహంలో డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.


logo