గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 25, 2020 , 07:21:19

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 30 మంది మృతి

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 30 మంది మృతి

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌ రాజధానిలోని ఓ విద్యా కేంద్రం సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. సుమారు 70 మంది వరకు గాయపడ్డారని భద్రతా వర్గాలు తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు మాట్లాడుతూ పేలుడులో 18 మంది వరకు చనిపోయారని, మరో 50 మంది గాయపడ్డారని పేర్కొన్నాయి. క్షతగాత్రుల్లో 37 మందిని కాబూల్‌లోని జిన్నా హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి విద్యా కేంద్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అంతకు ముంతు తాలిబాన్లు ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. మరో వైపు శనివారం ఉదయం ఆఫ్ఘన్‌ ప్రయాణికుల వాహనంపై బాంబు దాడి జరగ్గా.. 13 మంది వరకు మరణించారు. 30 మంది వరకు గాయపడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.