బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 07:08:20

ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు హత్య

ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు హత్య

బలియా : ఉత్తరప్రదేశ్‌లో దుండగుల కాల్పులకు జర్నలిస్టు బలయ్యాడు. పాత కక్ష్యలే హత్యకు కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బల్లియా జిల్లా ఫెఫానాలో హిందీ న్యూస్ ఛానల్‌తో పనిచేస్తున్న జర్నలిస్టు రతన్ సింగ్ (45)ను సోమవారం రాత్రి దుండగలు కాల్చి చంపారు. గ్రామ పెద్ద జబర్ సింగ్ ఇంటి సమీపంలో ఘటన జరగడంతో  అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రతన్‌సింగ్‌ కుటుంబానికి జబర్‌ సింగ్‌ కుటుంబానికి నడుమ వివాదాలున్నాయని బల్లియా ఎస్పీ దేవేంద్రనాథ్ తెలిపారు. మృతుడి తండ్రి వినోద్ సింగ్ సైతం జబర్ సింగ్ కుట్ర చేసి తన కుమారుడిని చంపించాడని ఆరోపిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు జబర్ సింగ్ సోదరుడుకి రతన్‌ సింగ్‌కు గొడవ జరిగినట్లు సమాచారం. మూడేళ్ల క్రితం తన పెద్ద కుమారుడిని సైతం వీరే చంపారని వినోద్ సింగ్ ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ యాదవ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo