శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 13:27:34

ఆర్థిక సమస్యలు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్య

ఆర్థిక సమస్యలు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్య

కాన్పూర్‌ : ఆర్థిక సమస్యలకు తోడు లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురై వ్యక్తి భార్యతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరం జగైపూర్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాకేశ్ కుమార్(39) అనే వ్యక్తి తన తల్లితోపాటు భార్య అర్చన(36) పిల్లలతో కలిసి జగైపూర్వా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. మొబైల్ ఉపకరణాలు అమ్మే దుకాణంలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా దుకాణం మూతపడటంతో ఏప్రిల్‌లో ఉద్యోగం కోల్పోయాడు.

అప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉన్న రాకేశ్‌ ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పక్క గది పైకప్పుకు బెడ్‌షీట్‌తో రాకేశ్‌ దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చకేరి ఎస్‌హెచ్‌ఓ రవి శ్రీవాస్తవ తెలిపారు.  ఉదయం మృతదేహాలను గుర్తించిన రాకేశ్‌ తల్లి పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం సాయంత్రం దంపతులు ఆర్థిక సమస్యపై తీవ్రంగా చర్చించారని, ఆ తర్వాత కుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి భార్యతో కలిసి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడని రాకేశ్‌ తల్లి దేవి కన్నీటిపర్యంతమవుతూ చెప్పింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo