ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 11:09:13

రైలు ఢీకొని మహిళ మృతి.. అంబులెన్స్‌ పంపలేదంటూ కుటుంబీకుల ఆందోళన

రైలు ఢీకొని మహిళ మృతి.. అంబులెన్స్‌ పంపలేదంటూ కుటుంబీకుల ఆందోళన

లాతేహర్‌ : జార్ఖండ్‌ లాతేహర్ జిల్లాలో రైలు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలై మృతి చెందింది. ఆరోగ్య కేంద్రం సిబ్బంది అంబులెన్స్ పంపకపోవడంతోనే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. టోలా జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో లాడియా గ్రామానికి చెందిన రుక్మిణీ దేవి అనే మహిళను రైలు ఢీకొట్టింది. రైల్వే అధికారులు సమీపంలోని చాంద్వా ఆరోగ్య కేంద్రం అంబులెన్స్‌ పంపాలని ఫోన్‌ చేశారు. సిబ్బంది అందుబాటులో లేదని చెప్పడంతో బాధితురాలి కుమారులు ఆమెను రైల్వేస్టేషన్‌లో అందుబాటులో ఉన్న స్ట్రెచర్‌పై ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందింది. అంబులెన్స్ హాస్పటల్‌ వెలుపలే ఉండటంతో కుటుంబ సభ్యులు సిబ్బందిని నిలదీశారు. అంబులెన్స్ పంపి ఉంటే తమ తల్లి బతికి ఉండేదని, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని కుమారులు, బంధువులు దవాఖాన ఎదుట ఆందోళకు దిగారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ అందుబాటులో లేకపోవడంతో పంపలేకపోయామని ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జి నంద్ కుమార్ పోలీసులకు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo