ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 23, 2020 , 19:10:01

పెళ్లిలో చేతివాటం చూపించిన దొంగలు.. భారీగా నగలు చోరీ

పెళ్లిలో చేతివాటం చూపించిన దొంగలు.. భారీగా నగలు చోరీ

నిజామాబాద్‌ : పెళ్లిలో చేతివాటం చూపించిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ శివారు బృందావన్‌ గార్డెన్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి మండపానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలు రూ. 20 లక్షల విలువైన నగలు చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.


logo