బుధవారం 03 జూన్ 2020
Crime - Mar 29, 2020 , 06:39:40

జవాన్‌ కొంపముంచిన ఎఫ్‌బీ పరిచయం

జవాన్‌ కొంపముంచిన ఎఫ్‌బీ పరిచయం

హైదరాబాద్ : సీఆర్‌పీఎఫ్‌లో జవాన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో యువతిగా పరిచయం అయిన ఓ సైబర్‌చీటర్‌ రూ.12 లక్షలు టోకరా వేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడికి మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో రీటా అనే పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి తాను ఇంగ్లాండ్‌లో ఉంటానని, ఓ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్నాన్నానంటూ పరిచయమయ్యాడు. కొన్నా ళ్లు ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ అనంతరం వాట్సాప్‌కు మారా రు. ఇంగ్లాండ్‌ నంబర్‌తోనే వాట్సాప్‌ చాటింగ్‌ చేస్తుండటంతో బాధితుడు ఆమె(చీటర్‌)చెప్పేది నిజమేనని నమ్మే శాడు. చాటింగ్‌ చేసిన తరువాత నా స్నేహానికి గుర్తుగా నీకు మంచి బహుమతి పంపిస్తానంటూ నమ్మించింది. రెండుమూడురోజుల తరువాత ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులమంటూ జవానుకు ఫోన్‌ వచ్చింది.

మీ పేరుతో ఒక పార్సిల్‌ వచ్చింది.. అందులో ల్యాప్‌టాప్‌, ఐఫోన్‌, డాలర్లు, యూకే పౌండ్స్‌, ఆభరణాలు ఉన్నాయి.. అయితే వీటి విలువ భారీగా ఉంటుంది.. కస్టమ్స్‌ క్లియెరెన్స్‌ చేయలేదంటూ ఫోన్‌ చేసిన వ్యక్తులు మాట్లాడారు. కస్టమ్స్‌ క్లియెరెన్స్‌కు రూ.80వేలు చెల్లించాలంటూ దఫద ఫాలుగా జీఎస్టీ, కరోనా క్లియెరెన్స్‌ సర్టిఫికెట్‌ కూడా కావాలంటూ నమ్మిస్తూ 15రోజులపాటు రూ.12లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించారు. ఇంకా డబ్బు లు అడుగుతుండటంతోపాటు ఇటీవల లాక్‌డౌన్‌ అయిన తరువాత కూడా తాము పార్సిల్‌ పంపిస్తామంటూ ఫోన్‌ చేయడంతో అనుమానం వచ్చిన జవాన్‌ ఇదంతా మోసమని గుర్తించాడు. దీంతో తనను గుర్తుతెలియని వ్యక్తులు మోసం చేశారంటూ శనివారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. 


logo