ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 16, 2020 , 15:28:11

పోలీస్ కావాలనే కోరిక.. యూనిఫాంలో తిరుగుతూ అరెస్ట్

పోలీస్ కావాలనే కోరిక.. యూనిఫాంలో తిరుగుతూ అరెస్ట్

శ్రీనగర్: పోలీస్ యూనిఫాంలో నగరంలో తిరుగుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడు చెప్పింది విని పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. జమ్ముకశ్మీర్‌లోని దోడాకు చెందిన ఒక వ్యక్తికి పోలీస్ కావాలన్న కోరిక బలంగా ఉన్నది. అయితే సెలక్షన్లలో అతడు ఎంపిక కాలేకపోయాడు. దీంతో పోలీస్ దుస్తులు ధరించి నగరంలో తిరుగుతున్నాడు. గమనినంచిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయగా అధికారులకు ఈ విషయాన్ని చెప్పాడు. కాగా అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదని డిప్యూటీ ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. దీంతో ఇకపై పోలీస్ యూనిఫాం ధరించవద్దని ఆ వ్యక్తిని హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo