శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 26, 2020 , 09:45:26

కరోనాతో జగిత్యాల అడిషనల్‌ ఎస్పీ మృతి

కరోనాతో జగిత్యాల అడిషనల్‌ ఎస్పీ మృతి

జగిత్యాల క్రైం : కరోనా వారియర్స్‌లో పోలీసులు ముందున్నారు.. ఇప్పటికే పలువురు మహమ్మారి బారినపడగా కొందరు కోలుకోగా మరికొందరు మృత్యువాతపడ్డారు. తాజాగా జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణామూర్తి బుధవారం తెల్లవారు జామున కరోనాతో మృతువ్యాతపడ్డారు. వారం రోజులుగా ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. 1989 బ్యాచ్‌కు చెందిన దక్షిణామూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్‌తో పాటు వరంగల్‌లో సంచలనం సృష్టించిన యాసిడ్‌ దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ సవరన్‌ స్ట్రీట్‌కు చెందిన దక్షిణామూర్తి ప్రస్తుతం జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాగా, ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయనున్న క్రమంలో మృతి చెందడంతో విషాదం నెలకొంది. అసాంఘీక కార్యకలాపాల కట్టడిలో కఠినంగా వ్యవహరిస్తారని పోలీస్‌ విభాగంలో ఆయనకు గుర్తింపు ఉంది. కరోనా మహమ్మారి ఆయనను బలి తీసుకోవడంతో జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. కాగా, ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయనున్న క్రమంలో మృతి చెందడంతో విషాదం నెలకొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo