ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 17:37:43

వంతెనకు సమీపంలో రోడ్డు కింద ఐఈడీ బాంబ్

వంతెనకు సమీపంలో రోడ్డు కింద ఐఈడీ బాంబ్

రాయ్‌పూర్: ఒక వంతెనకు సమీపంలోని రోడ్డు కింద ఐఈడీ బాంబును ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాజ్‌నందగావ్ జిల్లాలోని హతిజోలా, సముద్‌పానీ మధ్య రహదారిపై వంతెన సమీపంలో భూమిలో పాతిన ప్రెజర్ కుక్కర్ ఐఈడీని ఐటీబీపీ డాగ్ స్క్వాడ్ పసిగట్టింది. అనంతరం ఆ ప్రాంతాన్ని తవ్వి ఐఈడీని వెలికి తీసి సురక్షితంగా నిర్వీర్యం చేసింది. ఈ ప్రెజర్ కుక్కర్ ఐఈడీని మావోయిస్టులు అమర్చి ఉంటారని ఐటీబీపీ దళాలు అనుమానిస్తున్నాయి. ఈ రహదారిలో మరిన్ని ఐఈడీలను పాతిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. దీంతో 40వ బెటాలియన్‌కు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo