ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 26, 2020 , 22:33:14

కానిస్టేబుల్‌ ఆత్మహత్య..

 కానిస్టేబుల్‌ ఆత్మహత్య..

న్యూఢిల్లీ : ఢిల్లీలోని కరోల్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇండో-టిబెటిన్‌ పోలీస్‌ (ఐటీబీపీ) కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని తనువు చాలించాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన సందీప్‌ కుమార్‌ కరోల్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారీగా శుక్రవారం కూడా విధులు ముగించుకొని సహచరులతో కలిసి  ఇంటికి వెళ్లేందుకు బస్సుకోసం వేచి చూస్తున్న క్రమంలో ఉన్నట్టుండి తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సంజయ్‌ భాటియా తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న కమాండెంట్‌ రాజన్‌బాబు అతడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 2009 ఫిబ్రవరి 12 నుంచి కుమార్‌ 22వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది.logo