ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 06:48:48

దేశంలో పేలు‌ళ్లకు ఐసిస్‌ ప్లాన్.. కుట్రలో హైద‌రా‌బాదీ! ‌

దేశంలో పేలు‌ళ్లకు ఐసిస్‌ ప్లాన్.. కుట్రలో హైద‌రా‌బాదీ!  ‌

హైద‌రా‌బాద్: దేశంలో భారీ పేలు‌ళ్లకు ప్రణా‌ళిక రూపొం‌దిం‌చిన కేసులో ఐదు‌గురు నింది‌తు‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎ‌న్‌‌ఐఏ) న్యూఢి‌ల్లీ‌లోని ఎన్‌‌ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జి‌షీట్‌ దాఖ‌లు‌చే‌సింది. నింది‌తుల్లో హైద‌రా‌బాద్‌ చాంద్రా‌య‌ణ‌గు‌ట్టకు చెందిన అబ్దుల్లా బాసిత్‌ (26) మూడో నింది‌తు‌డిగా ఉన్నాడు. మార్చి 8న ఢిల్లీ పోలీస్‌ స్పెష‌ల్‌‌సెల్‌ నమో‌దు‌చే‌సిన ఎఫ్‌‌ఐ‌ఆర్‌ ఆధా‌రంగా ఎన్‌‌ఐఏ దర్యా‌ప్తు‌చే‌ప‌ట్టింది. 

ఐసిస్‌ అను‌బం‌ధ‌ సంస్థ ఇస్లా‌మిక్‌ స్టేట్‌‌ఖో‌ర‌సన్‌ ప్రొవై‌న్స్‌(‌ఐ‌ఎ‌స్కే‌పీ) ‌స‌భ్యు‌లైన ఐదు‌గురు నింది‌తు‌లపై దేశ‌ద్రోహం, ఉగ్ర‌వాదం, పేలుళ్ల కుట్ర కేసు‌లకు సంబం‌ధిం‌చిన ఆధా‌రా‌లను కోర్టులో సమ‌ర్పిం‌చింది. ఆఫ్గ‌ని‌స్థా‌న్‌లో షెల్టర్‌ తీసు‌కుం‌టున్న ఐసిస్‌ హ్యాండ్లర్‌ హుజా‌యి‌ఫల్‌ బకి‌స్తాని ఆదే‌శా‌లతో ఐసిస్‌ తర‌హాలో వరుస పేలు‌ళ్లకు ఇతర నింది‌తు‌లతో కలిసి బాసిత్‌ ప్లాన్‌‌చే‌శాడు. ఇందు‌కోసం భారీ మొత్తంలో ఐఈ‌డీని సమ‌కూ‌ర్చు‌కు‌న్నారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో పేలు‌ళ్లకు కుట్ర చేశారు. మహా‌రా‌ష్ట్ర‌లోని పర్యా‌టక ప్రాంతాలే లక్ష్యంగా పేలు‌ళ్లకు ప్రణా‌ళిక రచిం‌చి‌నట్టు ఎన్‌‌ఐఏ తన చార్జి‌షీ‌ట్‌లో పేర్కొ‌న్నది. 

మిగి‌లిన నింది‌తుల్లో శ్రీన‌గ‌ర్‌కు చెందిన జహ‌నబీ సమి అలి‌యాస్‌ దావూద్‌ ఇబ్రహీం అలి‌యాస్‌ అబు మహ్మద్‌ అల్‌ హింద్‌ అలి‌యాస్‌ అబు అబ్దుల్లా (36), అతడి భార్య హీనా బషీర్‌ బేగ్‌ (39), పుణె ఎర‌వా‌డకు చెందిన సందియ అన్వర్‌ షేక్‌ (20), ఖాండ్వాకు చెందిన నబీల్‌ సిద్దిక్‌ ఖత్రీ (27) ఉన్నారు.


logo